: 'రజనీకాంత్ హిట్ టు కిల్' అంటూ ట్విట్టర్ ఖాతా హ్యాక్
సౌతిండియా సూపర్ స్టార్, 'కబాలి'తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రజనీకాంత్ ట్విట్టర్ ఖాతా నిన్న రాత్రి హ్యాకింగ్ కు గురైంది. ఆయన ట్విట్టర్ ఎకౌంట్ ను హ్యాక్ చేసిన గుర్తు తెలియని దుండగులు కొందరు 'రజనీకాంత్ హిట్ టు కిల్' అన్న మెసేజ్ ను ఉంచి ఆయన అభిమానులను కంగారు పెట్టారు. తన తండ్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని వెల్లడించిన రజనీ కుమార్తె ఐశ్వర్య, దాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకోగలిగామని ప్రకటించారు. ఇప్పుడంతా మామూలుగానే ఉందని వెల్లడించారు. కాగా, ట్విట్టర్ లో ఆయనకు 30 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.