: దయాశంకర్ కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ కార్యకర్తల గుర్తింపు... పోస్కో చట్టం కింద కేసులు


బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్ కు సంబంధించిన వ్యవహారంలో యూపీ పోలీసులు కొత్త కేసులు నమోదు చేశారు. దయాశంకర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగిన బీఎస్పీ కార్యకర్తలు ఆయన కూతురుపై విరుచుకుపడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా మైనారిటీ తీరని దయాశంకర్ కూతురిపై వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దయాశంకర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆందోళన నాటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు బీఎస్పీ కార్యకర్తలను గుర్తించారు. వారిపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News