: ఆనందీ బెన్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సమర్పించిన రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. యువ నాయకత్వం వృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆమె రాజీనామా చేశారని చెప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, గుజరాత్ కు పరిశీలకులను పంపుతామని, ఆపై వారు ఎమ్మెల్యేలతో చర్చించి నివేదిక ఇచ్చిన తరువాత, తదుపరి సీఎం ఎవరన్న విషయాన్ని వెల్లడిస్తామని అన్నారు. 18 సంవత్సరాల పాటు ఆమె గుజరాత్ కు సేవలు చేశారని కొనియాడారు. నేడు ఆమె గవర్నరును కలిసి తన రాజీనామా లేఖను అందిస్తారని వెంకయ్య తెలిపారు.