: తన శరీరాన్ని కప్పుకోవడానికి ఆమెకు ఏదైనా ఇవ్వండి: యూఎస్ కోర్టులో కేకలు పెట్టిన న్యాయమూర్తి


ఓ షాపులో దొంగతనం చేసిందన్న ఆరోపణలతో ఎన్నో రోజులుగా జైల్లో ఉన్న ఓ మహిళను కోర్టులో ప్రవేశపెట్టిన వేళ, ఆమె చెప్పిన మాటలు, ఆమె ధరించిన దుస్తులను చూసిన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఓ పొడవైన షర్టును మాత్రమే ధరించి కోర్టుకు వచ్చిన ఆమె, ఎలాంటి ప్యాంటునూ వేసుకోలేదు. తనకు జైల్లో సరైన దుస్తులు ఇవ్వలేదని, మహిళలకు నెలవారీ అవసరమయ్యే న్యాప్ కిన్లు సైతం ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేయగా, న్యాయమూర్తి అంబెర్ వూల్ఫ్ జైలు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె నిలబడిన వేళ, తాను వేసుకున్న పొడవాటి టీ షర్టును కిందకు లాగి శరీరాన్ని కప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే, న్యాయమూర్తి చలించిపోయారు. "అయామ్ వెరీ సారీ. తన శరీరాన్ని కప్పుకునేందుకు ఏమైనా ఇవ్వగలరా? ఏదైనా... ఏదైనా..." అంటూ కేకలు పెట్టారు. జైలు కస్టడీలో ఉన్న ఓ మహిళ, నా ముందుకు ప్యాంటు లేకుండా వచ్చింది. అసలా జైల్లో ఏం జరుగుతోందని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ కేసులో ఆమెకు 100 డాలర్ల జరిమానా విధించారు న్యాయమూర్తి. ఆమెకు పూర్తి దుస్తులు ఇచ్చేంతవరకూ బయటకు పంపబోనని న్యాయమూర్తి వెల్లడించారు. కాగా, సదరు మహిళే దుస్తులు స్వీకరించలేదని జైలు అధికారులు ఆరోపిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News