: వచ్చే రెండు నెలలు డాక్టర్లు సెలవులు పెట్టొద్దు: మంత్రి ఈటల రాజేందర్
రానున్న రెండు నెలల పాటు వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, డాక్టర్లు లీవ్ లు పెట్టొద్దని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాలం మారుతోందని, వర్షా కాలం అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలలపాటు వైద్య సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టొద్దని ఆయన సూచించారు. పట్టణాల్లోని మురికి వాడలు, పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన తేవాలని ఆయన కోరారు. అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించాలని ఆయన తెలిపారు.