: ఈ బంద్ శాంపిల్ మాత్రమే...ప్రజలంతా రోడ్ల మీదికి వస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వం తెలుసుకోవాలి: శివాజీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధనలో నేడు జరిగిన బంద్ ఓ శాంపిల్ మాత్రమేనని సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధనసమితి నేత శివాజీ తెలిపాడు. బంద్ పై శివాజీ మాట్లాడుతూ, ఒక్క రోజు బంద్ నిర్వహించడం ద్వారా కేంద్రానికి ప్రజలు హెచ్చరికలు పంపారని అన్నారు. బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రజలంతా రోడ్ల మీదికి వస్తే ఎలా ఉంటుందో కేంద్రానికి అర్థమయ్యేలా చేయగలిగామని ఆయన పేర్కొన్నారు. అంతా కలిస్తే ఏపీలో ఎలా ఉంటుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించకపోవడం ద్వారా రాష్ట్రానికి హోదా సంపాదించాలని ఆయన ఎంపీలను కోరారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కు అవసరమైన హోదా ఇస్తే జీఎస్టీకి మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.