: పాతబస్తీలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఛత్రినాక శివాజీనగర్ లో ప్రేమజంట దీపిక, విజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంగా ఈ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.