: సోనియాకు తీవ్ర జ్వరం.. అర్థాంతరంగా ముగిసిన రోడ్ షో


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తీవ్ర జ్వరం కారణంగా వారణాసిలో ఆమె తలపెట్టిన రోడ్డు షో అర్థాంతరంగా ముగిసింది. అస్వస్థతకు గురైన సోనియా వైద్యుల సలహాపై హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. కాగా, సోనియా నేతృత్వంలో వారణాసిలో తలపెట్టిన భారీ రోడ్డుషోలో ఆమె కొన్ని గంటలపాటు మాత్రమే పాల్గొన్నారు. ఈ రోడ్డు షో ముగిసిన వెంటనే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించాల్సి ఉంది. కానీ, సోనియాకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు అన్ని కార్యక్రమాలను ఆమె రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News