: గాంధీజీని పట్టుకున్నట్టు ఇప్పుడు నన్ను ఇద్దరు పట్టుకుంటున్నారు: కమలహాసన్


ఇటీవల తన కార్యాలయంలో మెట్లపై నుంచి జారిపడ్డ ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ప్రస్తుతం చిన్నగా నడవగల్గుతున్నారు. ఈ విషయాన్ని కమల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ‘ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడగల్గుతున్నాను. గదిలో చిన్నగా అటూ ఇటూ నడవగల్గుతున్నాను. అయితే, గాంధీజీకి రెండు వైపులా ఇద్దరు సహాయకులున్నట్లుగా ప్రస్తుతం నాకు కూడా ఉన్నారు. ఈరోజు కాలి నొప్పి కొంచెం తక్కువగా ఉంది’ అని కమల్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, కమలహాసన్ స్వీయదర్శకత్వంలో ‘శభాష్ నాయుడు’ చిత్రం తెరకెక్కుతోంది. కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కుమార్తె శ్రుతి హాసన్, హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News