: ఉయ్యాలలో బిడ్డ కోసం చిరుత పులితో తలపడిన తల్లి!


ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌ లో ఉయ్యాలలో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రాణాలకు తెగించి సాహసం చేసింది. హరిద్వార్ శివార్లలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లోకి దగ్గర్లోని అడవిలోంచి వచ్చిన చిరుత పులి ప్రవేశించింది. ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్న పాపాయి దగ్గరకు వెళ్తోంది. దాని అడుగుల చప్పుడు విన్న బిడ్డ తల్లి లేచి చూసేసరికి పులి ఉయ్యాల వద్దకు చేరుకోవడం కనిపించింది. అంతే, ఆమె సివంగి అయింది. ఇంట్లోని కొడవలితో చిరుత మెడ నరికింది. ఈ సమయంలో చిరుత ఆమెపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఇద్దరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి చిరుతను కొట్టి చంపేశారు. తరువాత దానిని దహనం చేసేసి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో వచ్చిన అధికారులు ఆమెను హరిద్వార్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆమె ధైర్యాన్ని, అమ్మతనాన్ని అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News