: కోడలి ఆత్మగౌరవం కాపాడిన గుంటూరు అత్తకి ప్రధాని మోదీ ప్రశంసలు


ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే ఎంత ఇబ్బంది పడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళలైతే బహిర్భూమికి వెళ్లాలంటే అవమానభారంగా ఫీలవుతారు. బహిర్భూమి తప్పా, టాయిలెట్ ఎరుగని ఒక మహిళ తాను పడ్డ ఇబ్బంది తన కోడలు పడకూడదనుకుంది. అందుకే, తన కొత్త కోడలి కోసం ఒక టాయిలెట్ ను కట్టించి దానిని బహుమతిగా ఇచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక అత్తగారికి ప్రధాని నరేంద్రమోదీ నుంచి అభినందనలు అందాయి. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరానికి చెందిన షంషున్ అనే మహిళ తన కోడలికి ఈ టాయిలెట్ కట్టించింది. ఈ సందర్భంగా షంషున్ మాట్లాడుతూ, పేదరికంలో పుట్టిన తమ ఇంట్లో మరుగుదొడ్డనేది మొదటి నుంచి లేదని, దీంతో, బహిర్భూమికే వెళ్లేదానినని, చాలా అవమానభారంతో కుంగిపోయేదానినని చెప్పారు. తమ బాటలోనే పిల్లలు కూడా నడిచేవారని పేర్కొన్నారు. గత ఏడాది తన కొడుక్కి పెళ్లి ఖాయమవడంతో వివాహం చేశామని, తమ ఇంటికి వచ్చే అమ్మాయి ఈ బాధ పడకూడదని భావించి తన కోడలు సల్మా తమ ఇంట్లో అడుగుపెట్టేలోపే మరుగుదొడ్డి నిర్మించి ఆమెకు బహుమతిగా ఇచ్చామని షంషున్ చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్’ వెబ్ సైట్ లో ఈ విషయం రాసుంది. కోడలి ఆత్మగౌరవం కాపాడేందుకని గుంటూరు అత్త షంషున్ చేసిన ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు.

  • Loading...

More Telugu News