: ప్రధాని మోదీని ట్రంప్ తో పోల్చిన కన్నయ్య కుమార్


భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తో పోల్చుతూ జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్ పలు విమర్శలు చేశారు. కేరళలోని కోజికోడ్ లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నయ్య మాట్లాడుతూ, మోదీ, ట్రంప్ ఒకేలా మాట్లాడుతున్నారని, ముస్లింలు, ఇతర మైనార్టీలకు వీళ్లిద్దరూ వ్యతిరేకమని మండిపడ్డారు. అమెరికాలో ముస్లింలను, నల్లజాతీయులను దేశం నుంచి వెళ్లిపోవాలని ట్రంప్ చెబుతుంటే; భారత్ లో ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తున్నారని, దీనిని బట్టి చూస్తే వాళ్లిద్దరి అభిప్రాయాలు ఒకటేనని తెలుస్తోందని కన్నయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News