: మంచు మనోజ్ వాదనను ఖండించిన జూనియర్ ఆర్టిస్టులు!... నిర్మాతపై దాడి చేయలేదని ప్రకటన!


టాలీవుడ్ నిర్మాత అచ్చిబాబుపై దాడి చేశారంటూ తమపై యువ హీరో మంచు మనోజ్ చేసిన ఆరోపణలను జూనియర్ ఆర్టిస్టులు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డీబేట్ లో ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు ప్రసాద్, వెంకటేశ్ లు మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తాము అచ్చిబాబుపై ఎలాంటి దాడికి పాల్పడలేదని తెలిపారు. అచ్చిబాబు తమకు బకాయి ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించమని మాత్రమే అడిగామని తెలిపారు. పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న మంచు మనోజ్ లాంటి వారు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం తమను ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News