: 100 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతున్న విన్ డీజిల్!


హాలీవుడ్ నటుడు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' స్టార్ విన్ డీజిల్ సోషల్ మీడియా ఫేస్ బుక్ లైక్స్ లో ఇతర నటులకు అందనంత ఎత్తున ఉన్నాడు. విన్ డీజిల్ తాజాగా ఫేస్ బుక్ ఫాలోయలర్ల సంఖ్య 100 మిలియన్లను దాటేశాడు. దీంతో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ స్వయంగా విన్ డీజిల్ ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, వంద మిలియన్ ఫాలోయర్లను కలిగిన సెలబ్రిటీల్లో అగ్రస్థానంలో పాప్ స్టార్ షకీరా ఉండగా, తరువాతి స్థానంలో పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో ఉన్నాడు. వారి తర్వాత ఈ రికార్డును ఇప్పుడు డీజిల్ అందుకున్నాడు. విన్ విన్ డీజిల్ అభిమానుల్లో ఎక్కువ మంది అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాలకు చెందిన వారు ఉండడం విశేషం. త్వరలో విన్ డీజిల్, దీపికా పదుకొనే నటించిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8' ప్రేక్షకుల మందుకు రానుంది.

  • Loading...

More Telugu News