: జైట్లీతో సుజనా, సీఎం రమేష్ భేటీ
రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా లేదంటూ పరోక్షంగా ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ఆర్థిక సాయంపై పార్లమెంటు లోపలా, బయట టీడీపీ ఎంపీలు ఆందోళన చేసిన అనంతరం ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాలపై మరోసారి ఆయనతో చర్చించారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ కావాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుజనా చౌదరి, ప్రధాని కార్యాలయాన్ని కూడా సంప్రదించారు. ఈ మేరకు పీఎంవో ను సమయం కేటాయించాలని మళ్లీ కోరినట్టు సమాచారం.