: ‘తూర్పు’లో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు!... 15 మందికి గాయాలు


ప్రశాంతంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనూ రాజకీయ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలోని శంఖవరం మండలం మండపం గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య నేటి ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలోని పాఠశాల విద్యా కమిటీ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల మధ్య నెలకొన్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వాగ్వాదం కాస్తా పరస్పర దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో 15 మందికి గాయాలు కాగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఏ ఒక్క వర్గం నుంచి ఫిర్యాదు అందని నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు.

  • Loading...

More Telugu News