: అమెరికాలో కలకలం... ట్రంప్ భార్య మెలానియా నగ్న చిత్రాలను ప్రచురించిన 'ది న్యూయార్క్ పోస్ట్'
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ నగ్న చిత్రాలను 'ది న్యూయార్క్ పోస్ట్' పత్రిక ప్రచురించడంతో అమెరికాలో కలకలం రేగింది. ఆదివారం నాటి సంచిక ముఖచిత్రంతో పాటు లోపలి పేజీల్లో ఈ చిత్రాలను పత్రిక ప్రచురించింది. 1995లో మోడల్ గా రాణిస్తున్న వేళ మన్ హట్టన్ లో జరిగిన ఓ ఫోటో సెషన్ లో వీటిని తీసినట్టు తెలుస్తోంది. కొన్ని బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పాటు, రంగుల చిత్రాలనూ పత్రిక ప్రచురించింది. "మనకు కాబోయే తొలి మహిళ... ఎవరూ చూడని చిత్రాలు" అంటూ క్యాప్షన్ పెట్టింది. మెలానియాతో పాటు మరో మోడల్ పూర్తి నగ్నంగా దిగిన లెస్బియన్ థీమ్ చిత్రాన్ని ప్రచురించింది. కాగా, ట్రంప్ పేరు అధ్యక్ష పదవికి తొలిసారిగా వినిపించినప్పటి నుంచి మెలానియాకు సంబంధించిన వందలాది నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో వెల్లువలా సంచరిస్తూనే ఉన్నాయి. ఆమె గతంలో తీసుకున్న చిత్రాలు ట్రంప్ కు ఇబ్బందికరమైనవేనని, వీటిని పూర్తిగా తొలగించడం అసాధ్యమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ చిత్రాలను 1996లో ఫ్రాన్స్ మ్యాగజైన్ 'మాక్స్' కోసం తీయగా, ఇవన్నీ అప్పట్లోనే పబ్లిష్ అయి సంచలనం సృష్టించాయి. ఆమె న్యూడ్ ఫోటోలు ఎన్నో ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వాటిని తిరిగి ప్రచురించే ధైర్యం చేయడానికి పలు పత్రికలు వెనుకాడుతున్నాయని తెలుస్తోంది.