: ఎంపీ శశికళపై జయలలిత వేటు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి తిరస్కరించిన ఎంపీ
ఢిల్లీ ఎయిర్ పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచి శివపై ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ చేయి చేసుకున్న అంశంపై ఆగ్రహించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈరోజు రాజ్యసభలో ఏఐఏడీఎంకే, డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శశికళ రాజ్యసభలో స్పందిస్తూ.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా జయలలిత చేసిన ఆదేశాలను ఆమె తిరస్కరించారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో శశికళకు రక్షణ కల్పించాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సూచించారు.