: తెలంగాణలో ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు!... పోలీసు వాహనమెక్కి ఒంటరిగా కేటీఆర్ తనిఖీలు!


తెలంగాణలో ఇసుక మాఫియా గుండెల్లో నిజంగానే రైళ్లు పరుగెడుతున్నాయి. కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖలన్నీ చేతబట్టుకున్న టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారకరామారావు ఆకస్మిక తనిఖీలతో ఇసుక మాఫియాను బెంబేలెత్తిస్తున్నారు. నిన్నటిదాకా హైదరాబాదులోని దుర్భర స్థితిపై దృష్టి పెట్టిన కేటీఆర్... తాజాగా ఇసుక మాఫియాపై నిఘా పెట్టారు. నేటి ఉదయం ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరీంనగర్ జిల్లా చేరుకున్న కేటీఆర్... తన కాన్వాయ్ ను కరీంనగర్ లోనే వదిలేసి పోలీసు వాహనం ఎక్కారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఇసుక ర్యాంపుల వద్దకు వెళ్లారు. ఉన్నపళంగా కేటీఆర్ అక్కడ ప్రత్యక్షమవడంతో ఇసుక మాఫియా హడలెత్తిపోయింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్... అక్కడ కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించారు. కేటీఆర్ ఆకస్మిక పర్యటన గురించి తెలుసుకున్న ఇసుక మాఫియా... భవిష్యత్తులో తమ ఆటలు సాగవని భయభ్రాంతులకు గురవుతోంది.

  • Loading...

More Telugu News