: మాజీ సీఎంలకు ఢిల్లీలో ప్రభుత్వ భవనాలొద్దు!... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!


మాజీ ముఖ్యమంత్రులకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ భవనాల కేటాయింపునకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు చెప్పింది. దేశంలోని ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం మాజీలుగా మారిన నేతలకు ఢిల్లీలో ప్రభుత్వ భవనాలను కేటాయించరాదని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు కేటాయించిన ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయకుండా వాటిలోనే తిష్ట వేసుకుని కూర్చున్న నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాలు శరాఘాతంగానే పరిణమించనున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News