: హ్యాకర్ల బారి నుంచి 'విక్రమ సింహపురి' సేఫ్!


నెల్లూరు జిల్లాలోని 'విక్రమ సింహపురి' యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేయగా, గంటల వ్యవధిలోనే అధికారులు తిరిగి నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 'హెచ్ఈఎక్స్ 786' పేరిట సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు, భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు ఉంచారు. కాశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. దీన్ని గమనించిన వర్శిటీ అధికారులు, వెంటనే వెబ్ సైట్ ను డౌన్ చేసి, తిరిగి కంట్రోల్ చేసుకునే పనులు చేపట్టి, సైట్ ను పునరుద్ధరించారు. వెబ్ సైట్ ఇప్పుడు మామూలుగానే ఓపెన్ అవుతోంది. హ్యాకింగ్ పై నేడు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు వర్శిటీ యాజమాన్యం పేర్కొంది.

  • Loading...

More Telugu News