: కల్లుకు గేట్లు ఎత్తేసిన నితీశ్ సర్కారు!... లాలూ ఒత్తిడి ఫలితమేనని కథనాలు!


గడచిన ఎన్నికల తర్వాత బీహార్ లో ముచ్చటగా మూడో దఫా అధికారం చేపట్టిన జేడీయూ నేత నితీశ్ కుమార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన బీహార్ లో మద్య నిషేధానికి తెర తీశారు. దీంతో రాష్ట్రంలో కల్లు, గీత కార్మికుల జీవనం దుర్భరంగా మారిందట. ఇదే విషయాన్ని నితీశ్ ముందు పెట్టిన ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మద్య నిషేధం ఎత్తివేతపై ఒత్తిడి పెంచారు. లాలూ ఒత్తిడికి నితీశ్ కుమార్ పూర్తిగా తలొగ్గకున్నా... కొంతమేర అయినా మద్య నిషేధంపై సడలింపు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో కల్లుపై అమలవుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిన్న నితీశ్ సర్కారు సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో కల్లు విక్రయాలు, వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బీహార్ అబ్కారీ శాఖ మంత్రి అబ్దుల్ జమీల్ మస్తాన్ పాట్నాలో ప్రకటించారు.

  • Loading...

More Telugu News