: తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
పెట్రలోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రతినెలా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలను సమీక్షించే షెడ్యూల్ లో భాగంగా సమావేశమైన పెట్రోలియం కంపెనీల సమాఖ్య పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోలుపై 1.42 రూపాయలు, లీటర్ డీజిల్ పై 2.01 రూపాయలు తగ్గించారు. కాగా, వీటిపై ఇతర ట్యాక్సులు కూడా తగ్గించే అవకాశం కనిపిస్తుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరికాస్త తగ్గే అవకాశముందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తగ్గిన ధరలు నేటి అర్ధ రాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.