: అసమర్థుడ్ని వెంట ఉంచుకోవాలా?: తమ్ముడిపై డీకే అరుణ కీలక వ్యాఖ్య
తన సోదరుడు తన ఇష్ట ప్రకారం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ తెలిపారు. టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, తన సోదరుడే తన మాట వినడం లేదని అనడం సరికాదని అన్నారు. అసమర్థుడ్ని తన వెంట ఉంచుకునే కంటే, బయటకు పంపడమే మేలన్నది గుర్తించి అతను పార్టీ మారినప్పుడు పట్టించుకోలేదని ఆమె చెప్పారు. అధికారంలోకి రాలేదని పార్టీ వీడిన వాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తాడని ఆమె అడిగారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడితే, పార్టీ కూడా అండగా నిలుస్తుందని ఆమె చెప్పారు.