: ఏఎన్32 విమానం కోసం విశాఖ అడవుల్లో కాలి నడకన గాలింపు


చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ వెళ్తూ ఈ నెల 22న కనిపించకుండా పోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్‌-32 విమానం కోసం అధికారులు కాలినడకన గాలింపు చేపట్టారు. తొలుత విమానం సముద్రంలో కూలిపోయిందని భావించిన అధికారులు పలు ఆధారాలను పరిశీలించి విశాఖపట్టణం జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాలినడకన గాలింపు చేపట్టారు. విమానం గల్లంతైన రోజున జిల్లాలోని నర్సీపట్నం అటవీ ప్రాంతంలో పెద్దశబ్దం విన్నామని సూర్యలంకలోని ఎయిర్‌ బేస్‌ కి స్థానికుల నుంచి ఫోన్ వచ్చింది. దాని ఆధారంగా గగనతలం నుంచి గాలించారు. అయితే వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దానిని పెద్దగా పట్టించుకోలేదు. విమానాలు, నౌకలను రంగంలోకి దించి సముద్రంలో గాలింపు చేపడుతుండగా, గల్లంతైన విమానంలోని ఒక వ్యక్తి ఫోన్ రింగ్ అయిందని, నాలుగు రోజుల తరువాత అతని మెసేంజర్ చాటింగ్ స్టేటస్ చూపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి సూర్యలంక ఎయిర్ బేస్ కు తాము పెద్ద పేలుడు శబ్దం విన్నామని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నర్సీపట్నం డీఎఫ్‌వో శేఖర్‌ బాబుకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో నర్సీపట్నం, కేడీపేట పరిసరాల్లోని సరుగుడు, దుద్దుకుంట గ్రామాల పరిసరాల్లో గిరిజనుల సహాయంతో గాలింపు చేపట్టారు. రెండు రోజులు పూర్తయినా గాలింపులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News