: మృతదేహం నుంచి ఆత్మవెళ్తుండగా సీసీ టీవీలో రికార్డయిందట!


ఆత్మ అనేది ఉందా? లేదా? అనేది అనాదిగా మనిషిని వెంటాడుతున్న సందేహం. అయితే, సర్వమతాలు కూడా ఆత్మ అనేది వుందని, మనిషి మరణించగానే అది ఆ మృతశరీరం నుంచి బయటకు వెళ్లిపోతుందని చెబుతున్నాయి. అయితే, ఆధునిక శాస్త్ర విజ్ఞానం మాత్రం ఆత్మను ఒప్పుకోదు. అదంతా ట్రాష్ అంటూ సైంటిస్టులు కొట్టి పారేస్తారు. ఈ నేపథ్యంలో ఆత్మలను చూశామన్న వాళ్లు, ఆత్మలతో మాట్లాడామన్న వాళ్లు కూడా ఉన్నారు. చైనాలో కూడా ఈ ఆత్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. తాజాగా చైనాలోని ఓ ఆసుపత్రిలో మృతదేహం నుంచి ఆత్మలేచి వెళ్లడాన్ని తాము గమనించామని అక్కడి సిబ్బంది చెబున్నారు. చనిపోయిన మహిళ శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లడం అక్కడి సీసీ టీవీలో కూడా రికార్డయిందని వారు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఇలాంటి వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయని, వాటిలాగే ఇది కూడా ఫేక్ వీడియో అని, పలువురు పేర్కొంటున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

  • Loading...

More Telugu News