: ఇంటర్నెట్ లేకుండా ఫేస్ బుక్ చూడాలనుకుంటున్నారా? ఇదిగో ఇలా ట్రై చేయండి...!
ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫేస్ బుక్ చూడాలనుకుంటున్నారా? మీరు ఎయిర్టెల్, ఎయిర్సెల్, ఐడియా, టాటా డొకొమో యూజర్లయితే స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫేస్ బుక్ చూడవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం చేయాల్సిందేంటంటే.. స్టార్ 325 హ్యాష్ (*325#) ని ప్రెస్ చేయడమే. ఫేస్ బుక్ ఇండియా, ఫోనెట్ విష్ భాగస్వామ్యం వినియోగదారులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది. ఫోనెట్ విష్ అంటే యూఎస్ఎస్డీ (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే ఇంటరాక్టివ్ సర్వీస్. డేటా కనెక్షన్ లేకుండానే డివైస్ లను కనెక్ట్ చేసుకునే వెసులుబాటును యూఎస్ఎస్డీ కల్పిస్తుంది. ఇలా చేయడం వల్ల ఫేస్ బుక్ స్టేటస్ మాత్రమే ఉచితంగా చూసుకోగలరు. పోస్టింగ్ చెయ్యాలన్నా, కామెంట్ పెట్టాలన్నా, లైక్ చేయాలన్నా, ఫ్రెండ్స్ ను యాడ్ చేసుకోవాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. అయితే రోజుకి ఒక రూపాయి చెల్లిస్తే ఫేస్ బుక్ అపరిమితంగా చూసుకోవచ్చని యూఎస్ఎస్డీ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ 325 హ్యాష్ ను టైప్ చేసి ఫేస్ బుక్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఫేస్ బుక్ ఫీచర్లతో అనుసంధానం అవుతుందని వారు చెప్పారు.