: సినిమాల్లో నాకు సౌందర్య ఆదర్శం: అంకిత


సినిమాల్లో సౌందర్య తనకు ఆదర్శమని 'సింహాద్రి' సినిమాలో 'చీమ' పాటతో పాప్యులర్ అయిన అంకిత తెలిపింది. తాను సినిమాల్లోకి వచ్చే సమయంలో గాడ్ ఫాదర్ల అవసరం ఉండేది కాదని, మనసుకు ఏదనిపిస్తే అది చేస్తే సరిపోయేదని తెలిపింది. అయితే తెలుగు సినీ పరిశ్రమకు తనను పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి, తనకు 'సింహాద్రి'లో అవకాశం ఇచ్చిన రాజమౌళిలను గాడ్ ఫాదర్లుగా భావించవచ్చని తెలిపింది. ఇప్పుడు అవకాశం వస్తే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించాలని వుందని అంకిత చెప్పింది. అల్లు అర్జున్ సరసన నటించాలని ఉన్నా తన కంటే అతను చిన్నవాడవుతాడని అంకిత అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News