: అత్యంత ఖరీదైన ఖనిజమిదే... గ్రాము రూ. 41.87 కోట్లు మాత్రమే!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఖనిజమేదన్న ప్రశ్నకు సాధారణంగా బంగారం, వజ్రం, ప్లాటినం వంటి సమాధానాలు, ఇంకాస్త తెలివైన వారు ఇరీడియం అని చెబుతుంటారు. కానీ, అత్యంత ఖరీదైన ఖనిజం ఏంటో తెలుసా? బిలియనీర్లు సైతం తమ ఆస్తులను అమ్ముకున్నా, కేవలం గ్రాముల్లో మాత్రమే సొంతం చేసుకోగల దీని పేరు 'యాంటీ హైడ్రోజన్'. యాంటీ మేటర్ లక్షణాలతో కనిపించే ఇది అత్యంత అరుదుగా మాత్రమే సహజ రూపంలో లభిస్తుంది. దీంతో ఈ యాంటీ హైడ్రోజన్ ను కృత్రిమంగా తయారు చేసి రాకెట్లలో, న్యూక్లియర్ బాంబుల్లో ట్రిగ్గర్ గా మాత్రమే వాడుతున్నారు. ఇక దీని తయారీకి లక్షల కోట్ల డాలర్లను వెచ్చిస్తున్న నాసా, ఈ యాంటీ హైడ్రోజన్ ఖనిజం గ్రాము ధర రూ. 41,87,50,000 అని చెబుతోంది.