: తెలుగుదేశం నచ్చలేదట... వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ చేసి తిరిగొచ్చిన మహిళా జెడ్పీటీసీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఏఎస్పేట జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి, తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన కుదారి హజరత్తమ్మ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలు తనకు నచ్చలేదని, వైకాపాను వీడిన తరువాత ఎంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్పిన ఆమె, నమ్మి ఓట్లేసిన ప్రజల ఆశలు వమ్ము చేయరాదన్న ఉద్దేశంతోనే తిరిగి పార్టీలోకి వచ్చినట్టు తెలిపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆమె వైకాపాలో చేరారు. వైఎస్ఆర్ సీపీ తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇకపై జగన్ చేసే ప్రజా ఉద్యమాలకు మద్దతు పలుకుతానని అన్నారు.