: సెల్ఫీ తీసుకుంటూ అథ్లెట్ పూజా కుమారి మృతి... శాయ్ లో విషాదం


స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) భోపాల్ లో నిర్వహిస్తున్న హాస్టల్ లో ఉంటున్న జాతీయ స్థాయి అథ్లెట్ పూజా కుమారి (20) సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ, ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందింది. నిన్న సాయంత్రం సహచర క్రీడాకారిణులతో కలసి చెరువుకు వెళ్లిన ఆమె, సెల్ఫీకి ప్రయత్నించి నీటిలో పడింది. ఆమెకు ఈత రాకపోవడంతో సాయం చేయాలని కేకలు పెట్టింది. పూజాతో పాటున్న మిగతా వాళ్లకూ స్విమ్మింగ్ తెలీకపోవడంతో ఎవరూ చెరువులోకి దిగే సాహసం చేయలేక, హాస్టల్ కు పరిగెత్తుకు వెళ్లి, విషయం చెప్పి మరికొందరిని వెంటబెట్టుకు వచ్చేవరకూ పూజ ప్రాణాలు పోయాయి. ఈ ఘటన శాయ్ లో విషాదాన్ని నింపింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పూజా, గత మూడేళ్లుగా హాస్టల్ లో ఉంటున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News