: జపాన్ తరహా నిరసనలకు తెలుగుదేశం నిర్ణయం!


ఏపీకి హోదా ఇచ్చేది లేదని చెబుతున్న బీజేపీ వైఖరిని తప్పుబడుతూనే, ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకునే ఆలోచన చేయరాదని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జపాన్ తరహాలో వినూత్న నిరసనలు తెలపడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. అరుణ్ జైట్లీ ప్రసంగంపై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, జపాన్ లో ప్రజా నిరసనలను పార్టీ నేతల వద్ద గుర్తు చేశారు. మరింత ఎక్కువగా పనిచేయడం, రహదారులను ఊడ్చడం, పట్టణాలు, నగరాల్లో మౌన ప్రదర్శనలు చేయడం వంటి వాటి ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నిరసనలు ఎలా ఉండాలి? అప్పటికి కూడా మోదీ ప్రభుత్వం స్పందించకుంటే ఏం చేయాలి? వంటి అంశాలపై మరికాసేపట్లో ఎంపీలతో జరిగే సమావేశంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News