: విజయవాడలో రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపు... తీవ్ర ఉద్రిక్తతలు
విజయవాడలో పోలీసు కార్యాలయం ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ ఎత్తున పోలీసులను మోహరించి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఆగ్రహం రేపింది. గత ప్రభుత్వం హయాంలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని రహదారుల విస్తరణ పేరుతో తొలగించడం సరికాదని వైఎస్సార్సీపీ నేతలు హితవు పలికారు. దీంతో అక్కడికి భారీ ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేయడంతో, అంతే స్థాయిలో ప్రభుత్వం పోలీసులను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.