: ఏఎన్32 విమానం గల్లంతు వ్యవహారంలో విశాఖ అడవుల్లో వెతుకులాట?


ఈ నెల 22న గల్లంతైన భారత వాయుసేనకు చెందిన ఏఎన్‌-32 విమానం గాలింపు ప్రక్రియ సముద్రంలోనే కాకుండా, నేలపై కూడా జరుగుతోంది. ఇప్పటికే జలాంతర్గాములు, నౌకలు, విమానాలతో గాలింపు చేపట్టిన భారత ప్రభుత్వం విశాఖలో బాధితుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, చూపిన ఆధారాలతో భూమిపై కూడా గాలింపు చేపట్టింది. ఏఎన్32ను వెతకడంలో సాయం చెయ్యండంటూ అమెరికాను కోరిన రెండో రోజే విశాఖ అడవుల్లో గాలింపు చేపట్టింది. విశాఖ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం, ఏవోబీలో గిరిజనుల సాయంతో గాలింపు చేపట్టింది. ప్రధానంగా నాతవరం మండలంలోని సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో విమానం కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News