: అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్!
సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చేలా తన నటనతో, యువతలో హుషారు వచ్చేలా అద్భుతమయిన డ్యాన్స్‌లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు. తనను కలవాలన్న ఓ క్యాన్సర్ రోగిని ఎన్టీఆరే స్వయంగా వెళ్లి కలిశారు. తన కోరిక నెరవేరడంతో కాన్సర్ రోగి నాగార్జున ఆకాశమంత ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్ అభిమాని నాగార్జున బెంగళూరుకి చెందిన వ్యక్తి. క్యాన్సర్‌తో బాధపడుతోన్న నాగార్జునకి ఎంతో కాలంగా ఎన్టీఆర్‌ను కలవాలనే కోరిక ఉండేది. నాగార్జున గురించి తెలుసుకున్న తారక్ ఈరోజు అతడిని కలిశారు. అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నాగార్జున కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఎన్టీఆర్‌ని చూడగానే నాగార్జున ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పెదవిపై నవ్వులు చిందిస్తూ తారక్‌తో మాట్లాడాడు.