: పరిగిలో దోపిడీ దొంగల స్వైర విహారం!... సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టేసిన పోలీసులు!


రంగారెడ్డి జిల్లా పరిగిలో దోపిడీ దొంగలు నిన్న రాత్రి స్వైర విహారం చేశారు. ఎక్కడో దోపిడీకి పాల్పడి రోడ్డెక్కిన దొంగలు తమకు ఎదురుపడ్డ హైవే పెట్రోలింగ్ పోలీసులపై దాడికి దిగారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న పోలీసులు దొంగలను వెంటాడారు. సినీ ఫక్కీలో కిలో మీటర్ల మేర దొంగలను వేటాడిన పోలీసులు ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠాలోని మరో దొంగ పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నాడు. ప్రస్తుతం పారిపోయిన దొంగ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News