: ఆర్బీఐ గవర్నర్ గా నేనా?... అంతా ఊహాగానమేనన్న అరుంధతీ భట్టాచార్య!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా త్వరలో దిగిపోనున్న రఘురామ్ రాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టేవారు ఎవరన్న విషయంపై ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ అరుంధతీ భట్టాచార్య నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజన్ ప్లేస్ లో అరుంధతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆమె కూడా ఒకరని కథనాలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా అరుంధతి ఈ కథనాలను కొట్టిపారేశారు. ఆర్బీఐ గవర్నర్ రేసులో తాను లేనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలేనని ఆమె తేల్చేశారు. గవర్నర్ రేసుకు సంబంధించి తాను ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ కూడా చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో మాట్లాడేందుకు ఏమీ లేదని కూడా అరుంధతి చెప్పారు.

  • Loading...

More Telugu News