: ఎంసెట్-2 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి... హైకోర్టులో పిటిషన్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. వారు పరీక్షను రద్దు చేయొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, ఎంసెట్-2ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ మహేందర్‌రాజు అనే న్యాయవాది ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక, ఈ పరీక్ష లీకేజీకి సంబంధించిన సీఐడీ విచారణ కోర్టు పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.