: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కేరళ మాజీ సీఎం వూమెన్‌చాందీ.. ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు


కేరళలోని కొల్లంలో తాను ప్రయాణించాలనుకున్న రైలు మిస్సయిపోవడంతో కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్‌చాందీ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయనకి ఆ సమయంలో బస్సులో కాకుండా కారులోనూ ప్రయాణించే అవకాశం ఉంది. అయినప్పటికీ కారు వద్దనుకున్న ఆయ‌న.. ఆర్టీసీ బస్సులో ప్ర‌యాణించారు. కొల్లం నుండి తిరువనంతపురం వరకు 75 కి.మీ. ఆర్టీసీ బస్సులో ప్ర‌యాణించిన ఆయ‌న‌తో ఆ బ‌స్సులో ఉన్న 25 మంది ప్ర‌యాణికులు సెల్ఫీలు దిగారు. ఈ సంద‌ర్భంగా వూమెన్‌చాందీ ప్ర‌యాణికుల‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఈ స‌మాచారాన్ని తెలుసుకున్న మీడియా ప్ర‌తినిధులు వూమెన్‌చాందీ ప్ర‌యాణిస్తోన్న బస్సు ఎక్కారు. ఆయ‌న బ‌స్సు దిగే స‌మ‌యంలోనూ బ‌స్టాండ్ వ‌ద్ద ఆయ‌న కోసం మ‌రికొంత మంది మీడియా ప్రతినిధులు ఎదురుచూశారు. ఈ సంద‌ర్భంగా వూమెన్‌చాందీ మాట్లాడుతూ.. తాను 10 సంవ‌త్స‌రాల త‌రువాత బ‌స్సు ప్రయాణం చేసిన‌ట్లు చెప్పారు. అంతేగాక‌, ‘నాకు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించ‌డం అంటే చాలా ఇష్టం’ అని వూమెన్‌చాందీ చెప్పారు. ‘నా ప‌ద‌వి వ‌ల్ల ఇన్ని ఏళ్లూ ఆర్టీసీలో ప్ర‌యాణించ‌లేక‌పోయా’ అని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్పుడు ప‌ద‌వి లేదు కాబ‌ట్టి ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణం చేస్తాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News