: మా ప్రభుత్వం బ్లేమ్ అవ్వకూడదు...నాకు టైమివ్వండి సార్!: కురియన్ తో సుజనా చౌదరి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఎవరితోనూ సరైన చర్చలు జరపకుండానే, చట్టసభల్లో సంఖ్యాబలం వుందని చెప్పి , ఏపీని ఆనాడు ముక్కలు చేశారని అన్నారు. రాష్ట్ర విభజనకు రెండు ప్రధాన జాతీయ పార్టీలే కారణమని ఆయన చెప్పారు. చర్చ సందర్భంగా ఏపీని ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నారని, అది సరికాదని, ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు వేరు, ఇతర రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరని ఆయన అన్నారు. ఈ సమయంలో డిప్యూటీ ఛైర్మన్ సమయాభావం గురించి హెచ్చరించారు. దీనికి సుజనా సమాధానం ఇస్తూ... తనకు టైం కావాలని, కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రభుత్వం బ్లేమ్ కాకూడదని, అందుకు తనకు సమాధానం ఇవ్వాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం, ఇతర విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. రైల్వే జోన్, ప్రత్యేకహోదా తక్షణం ప్రకటించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News