: 'బాటసారి'కి ఘనస్వాగతం
మీదపడుతున్న వయసును సైతం లెక్కచేయకుండా, 63 ఏళ్ళ వయసులో 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బాటసారి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది. ఈ మధ్యాహ్నం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న బాబుకు టీడీపీ శ్రేణులు నీరాజనం పట్టాయి. విమానాశ్రయం ప్రాంతం పసుపుమయం అయింది. పార్టీ నేతలు, వేలాదిగా కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడికి జేజేలు పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఓపెన్ టాప్ వాహనంపై బాబు విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. బాబు వెంట బాలకృష్ణ కూడా ఉన్నారు.