: నేను ఆరోజే చెప్పాను... ఈ రోజు జరిగింది అదే: రాజ్యసభలో నరేష్ గుజ్రాల్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన రోజే...మీరు అన్యాయానికి గురవుతారని చెప్పానని ఎంపీ నరేష్ గుజ్రాల్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, గతంలో విభజన సందర్భంగా చేసిన హామీలు నెరవేర్చక ఛండీగఢ్ నాశనమైపోయిందని అన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖాండ్ విషయంలో కూడా అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ విషయంలో కూడా అదే జరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాదును ఏపీ నుంచి వేరు చేయడం ద్వారా ఆ రాష్ట్రాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. దీనిని పూరించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని ఆయన తెలిపారు. తక్షణం ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.