: మరికాసేపట్లో 'ఎంసెట్-2'పై కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2ను రద్దు చేసి మరోసారి ఎంసెట్ నిర్వహించాలా.. వద్దా.. అనే అంశంపై మరికాసేపట్లో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. డీజీపీ అనురాగ్ శర్మ, సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌ని కలవనున్నారు. ఈ అంశంపై వారి నుంచి సమాచారం తీసుకొని, చర్చించడానికి మెదక్ జిల్లాలోని ఫాంహౌజ్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. సీఐడీ నిన్న ఇచ్చిన నివేదికను కేసీఆర్‌కు అనురాగ్ శర్మ అందజేస్తారు. దానిపై చర్చించిన తరువాత ఎంసెట్-2 రద్దుపై ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.