: ఎప్పుడూ సెంచరీలు, డబుల్ సెంచరీలు ఎలా కొడతాం?: ఛటేశ్వర్ పుజారా నిర్వేదం


ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్ లో పెద్దగా రాణించలేక విమర్శలకు గురైన ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా, మీడియా ముందుకు వచ్చాడు. కొన్ని మ్యాచ్ లలో తన నుంచి భారీ స్కోర్లు రాలేదని అంగీకరించిన ఆయన, ఎప్పుడూ సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం సాధ్యం కాదని నిర్వేదంగా అన్నాడు. తన ఫామ్ పై ఎలాంటి ఆందోళనలూ అవసరం లేదని, తాను హాఫ్ సెంచరీ చేసి ఆరు మ్యాచ్ లు మాత్రమే అయిందని గుర్తు చేశాడు. అవతలి ఎండ్ లో ఉన్న ఆటగాళ్లతో స్ట్రయిక్ రొటేట్ చేయడంలో తన వంతు సహకారాన్ని అందించడంలో విజయవంతమవుతున్నానని చెప్పాడు. గతంలో కీలక పరిస్థితుల్లో మంచి ఇన్నింగ్స్ ఆడానని చెప్పుకున్న పుజారా, వెస్టిండీస్ మ్యాచ్ లో మాత్రం చెత్త షాట్ ఆడబోయి వికెట్ ను సమర్పించుకున్నానని అంగీకరించాడు. బ్యాటింగ్ ను మరింతగా మెరుగుపరచుకునేందుకు కోచ్ అనిల్ కుంబ్లేతో చర్చిస్తున్నానని చెప్పాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో వారిని 4-0 తేడాతో ఓడించడమే తమ లక్ష్యమని తెలిపాడు.

  • Loading...

More Telugu News