: భూములివ్వని రైతులపై భూసేకరణ ప్రయోగిస్తాం!: సీఆర్డీఏ కొత్త కమిషనర్ ప్రకటన
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక విభాగంగా పరిగణిస్తున్న ఏపీ సీఆర్డీఏకు కొత్త కమిషనర్ గా నేటి ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించిన యువ ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ తన ఉద్దేశాన్ని ఆదిలోనే చెప్పేశారు. చార్జీ తీసుకున్న తర్వాత ఆయన ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని పరిధిలో ఇఫ్పటికే 33 వేల ఎకరాల భూమిని సేకరించామని చెప్పిన ఆయన... అక్కడక్కడ భూములు ఇవ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించక తప్పదని పేర్కొన్నారు. ఇప్పటికే నేలపాడులోని భూములకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పిన శ్రీధర్... త్వరలో మిగిన 29 గ్రామాల్లోనూ ఈ చట్టాన్ని ప్రయోగిస్తామని పేర్కొన్నారు.