: ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి చర్చకు రానుంది. ‘హోదా’ చర్చ మొదలుకాగానే మొదట దానిపై ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రసంగం వుంటుంది. తరువాత ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తోందోనన్న ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఇరకాటంలో నెట్టేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేస్తోందోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.