: విద్యుదాఘాతంతో ‘టెక్ మహేంద్ర’ ఇంజనీర్ మృతి


విద్యుదాఘాతం కారణంగా తీవ్రంగా గాయపడ్డ ‘టెక్ మహేంద్ర’ ఇంజనీర్ సయ్యద్ ఇస్మాయిల్ (26) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 27వ తేదీ ఉదయం ఆరు గంటలకు మూత్ర విసర్జన నిమిత్తం ఇంటి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ తెగి పడి ఉన్న విద్యుత్ తీగను గమనించని ఇస్మాయిల్ దానిని తాకడంతో ప్రమాదానికి గురయ్యాడు. సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ లోని బహూదూర్ పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ కుమారుడు సయ్యద్ ఇస్మాయిల్. హైదరాబాద్ లోని ‘టెక్ మహేంద్ర’ లో క్యాడ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

  • Loading...

More Telugu News