: టీవీలు, వార్తలు, రాజకీయాలకు దూరంగా 12 రోజుల పాటు కేజ్రీవాల్!
వచ్చే నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన దైనందిన రాజకీయ జీవితానికి దూరంగా 12 రోజులు గడపనున్నారు. భారత పురాతన ధ్యాన మార్గాల్లో ఒకటైన 'ఉపాసన'ను ఆయన అభ్యసించనున్నారు. నాగపూర్ లోని ఓ మెడిటేషన్ సెంటరుకు ఆయన వెళ్లనున్నారని, అక్కడ టీవీ చానళ్ల నుంచి వార్తా పత్రికలు సహా ఏ ఇతర ప్రసార మాధ్యమాలూ అందుబాటులో ఉండవని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ 12 రోజుల పాటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇన్ చార్జ్ గా ఉంటారని తెలిపారు. కాగా, రెండేళ్ల క్రితం కూడా కేజ్రీవాల్ ఇదే విధమైన ధ్యాన మార్గంలో కొంతకాలం పయనించారు. ఆపై రెట్టించిన ఉత్సాహంతో వచ్చి 2015 ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.