: కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణలో మరింత చౌకగా సెల్ ఫోన్లు!
సెల్ ఫోన్లపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను ప్రస్తుతమున్న 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో పన్ను 5 శాతంగానే ఉంది. అధిక పన్ను మూలంగా అమ్మకాలు తగ్గుతుండటంతో మొబైల్ కంపెనీలు, రీటెయిలర్లూ గగ్గోలు పెడుతుండటంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యాట్ ను తగ్గిస్తూ రెవెన్యూ శాఖ వాణిజ్య పన్నుల విభాగం చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. మొబైల్ ఫోన్ల అమ్మకాలను వ్యాట్ చట్టం-2005 పరిధిలోని నాలుగో షెడ్యూల్ లోకి తీసుకువచ్చినట్టు తెలిపారు.