: ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి, ఇతర రాష్ట్రాలకు చాలా తేడా ఉంది: గులాం నబీ ఆజాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడానికి చాలా తేడా ఉందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు కనీసం రాజధాని కూడా లేదని అన్నారు. పదేళ్ల పాటు వాళ్లు వేరే రాజధానిలో ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అలాంటి వారు నిలబడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన అన్నారు. ఇది మనీ బిల్లా? లేక సాధారణ బిల్లా? అన్న మీమాంసను పక్కన పెట్టి, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన సూచించారు. ఏపీ ప్రజలంతా నిరాశలో ఉన్నారని, వారి నిరాశను ఆశగా మార్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన తెలిపారు.